సామెతలు 6: 3
క్రాస్-రిఫరెన్స్‌లు
" నా కుమారుడా, నీ చెలికానిచేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము."
సంబంధిత రిఫరెన్స్‌లు
పెదవులవలని దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును.
బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును.
నీ నోటి మాటయే నీమీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తనవారిలో ఒకని పిలిచి నీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను.
యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చియున్నాడు. దుష్టులు తాము చేసికొనినదానిలో చిక్కియున్నారు(హిగ్గాయోన్ సెలా.)
వారి పెదవుల మాటలనుబట్టియు వారి నోటి పాపమునుబట్టియు వారు పలుకు శాపములనుబట్టియు అబద్ధములనుబట్టియు వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక.
కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను.
మరియు నీవు నా రాజ్యములో సగముమట్టుకు ఏమి అడిగినను నీకిచ్చెదనని అతడు ఆమెతో ఒట్టుపెట్టుకొనెను