1రాజులు 14: 4
క్రాస్-రిఫరెన్స్‌లు
" యరొబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అహీయా యింటికి వచ్చెను. అహీయా వృద్ధాప్యముచేత కండ్లు కానరానివాడై యుండెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
అంతట యరొబాము యెరూషలేములోనుండి బయలు వెడలిపోగా షిలోనీయుడును ప్రవక్తయునగు అహీయా అతనిని మార్గమందు కనుగొనెను; అహీయా క్రొత్త వస్త్రము ధరించుకొనియుండెను, వారిద్దరు తప్ప పొలములో మరి యెవడును లేకపోయెను.
ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరచుకొనిన తరువాత వారందరు షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి.
కాబట్టి జనులు పాళెములోనికి తిరిగిరాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులో నున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసికొని మన మధ్య నుంచుకొందము రండి; అది మన మధ్య నుండినయెడల అది మన శత్రువుల చేతిలోనుండి మనలను రక్షించుననిరి.
కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడనుండి కెరూబుల మధ్య ఆసీనుడైయుండు సైన్యములకధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క యిద్దరు కుమారులైన హొఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి.
పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి, ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమునుబట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి; ఇదే యెహోవా వాక్కు.
నేను మీతో మాటలాడినను పెందలకడ లేచి మీతో మాటలాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నుండినవారై యీ క్రియలన్నిటిని చేసితిరి గనుక
నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామముపెట్టబడిన యీ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను ఆలాగే చేయుదును.
ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా, అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో ననెను.
ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యమువలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయెను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసికొనివచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను.
మోషే చనిపోయినప్పుడు నూట ఇరువది సంవత్సరముల యీడుగలవాడు. అతనికి దృష్టి మాంద్యములేదు, అతని సత్తువు తగ్గలేదు.
ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తనస్థలమందు పండుకొనియుండగాను
ఏలీ తొంబది యెనిమిదేండ్లవాడై యుండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను.
మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్నయెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.
ఆ దినమున ఇంటి కావలివారు వణకుదురు బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది యగుటచేత పని చాలించుకొందురు, కిటికీలలోగుండ చూచువారు కానలేకయుందురు.
యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను