1రాజులు 21: 18
క్రాస్-రిఫరెన్స్‌లు
" నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలురాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము, అతడు నాబోతుయొక్క ద్రాక్షతోటలో ఉన్నాడు; అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోవా మాటనుబట్టి బేతేలులోనున్న బలిపీఠమునకు విరోధముగాను, షోమ్రోను పట్టణములోనున్న ఉన్నత స్థలములలోని మందిరములన్నిటికి విరోధము గాను, అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించునని తన కుమారులతో చెప్పెను.
అతడు అహజ్యాను వెదకెను. అతడు షోమ్రోనులో దాగియుండగా వారు అతని పట్టుకొని యెహూనొద్దకు తీసికొనివచ్చిరి; వారు అతని చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదకిన యెహోషాపాతు కుమారుడు గదా అనుకొని అతని పాతిపెట్టిరి; కాగా రాజ్యమేలుటకు అహజ్యా యింటివారు ఇక నెవరును లేకపోయిరి.
అంతలో అహీయా ద్వారము లోపలికి వచ్చు నామె కాలిచప్పుడు విని ఆమెతో ఇట్లనెను యరొబాము భార్యా, లోపలికి రమ్ము; నీవు వేషము వేసికొని వచ్చుటయేల? కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని నాకు ఆజ్ఞయాయెను.
అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారిమధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే; నీవెక్కిన మంచముమీదనుండి దిగిరాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పెను.
రథము సిద్ధము చేయుమని యెహోరాము సెలవియ్యగా వారు అతని రథము సిద్ధము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలు రాజైన యెహోరామును యూదా రాజైన అహజ్యాయును తమ తమ రథములనెక్కి యెహూను కలియబోయి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు అతనిని ఎదుర్కొనిరి.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీవు యూదారాజు నగరు దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపుము
నాకును నీకును ముందుగానున్న ప్రవక్తలు, అనేకదేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు, కీడు సంభవించుననియు, తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచు వచ్చిరి.
యాజకులారా, నామాట ఆలకించుడి; ఇశ్రాయేలు వారలారా, చెవినిబెట్టి ఆలోచించుడి; రాజసంతతి వారలారా, చెవియొగ్గి ఆలకించుడి, మీరు మిస్పామీద ఉరిగాను తాబోరుమీద వలగాను ఉన్నారు గనుక మిమ్మునుబట్టి ఈ తీర్పు జరుగును.