1రాజులు 3: 20
క్రాస్-రిఫరెన్స్‌లు
" కాబట్టి మధ్య రాత్రి యిది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి, నా ప్రక్కలోనుండి నా బిడ్డను తీసికొని తన కౌగిటిలో పెట్టుకొని, చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
వెలుగుమీద తిరుగబడువారు కలరు వీరు దాని మార్గములను గురుతుపట్టరు దాని త్రోవలలో నిలువరు.
తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును వాడు దరిద్రులను లేమిగలవారిని చంపును రాత్రియందు వాడు దొంగతనము చేయును.
వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుకు వేసికొని సందె చీకటికొరకు కనిపెట్టును.
చీకటిలో వారు కన్నము వేయుదురు పగలు దాగుకొందురు వారు వెలుగు చూడనొల్లరు
వారందరు ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు. గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసియున్నది.
అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేననుకొనినయెడల
మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను.
దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు.
ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ్య చూడగా అది చచ్చినదాయెను; తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలిసికొంటిని.