లేఖనాలను అన్వేషించండి

1రాజులు 8: 52

క్రాస్-రిఫరెన్స్‌లు

" కాబట్టి నీ దాసుడనైన నేను చేయు విన్నపము మీదను, ఇశ్రాయేలీయులగు నీ జనులు చేయు విన్నపము మీదను, దృష్టియుంచి,వారు ఏ విషయములయందు నిన్ను వేడుకొందురో ఆ విషయములయందు వారి విన్నపముల నాలకించుము."

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 8:29

నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించునట్లు నా నామము అక్కడ ఉండునని యే స్థలమునుగూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన యీ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి యుండునుగాక.

2దినవృత్తాంతములు 6:40

నా దేవా, యీ స్థలమందు చేయబడు విన్నపముమీద నీ కనుదృష్టి యుంచుదువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక.

కీర్తనలు 86:5

ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు నీకు మొఱ్ఱపెట్టువారందరియెడల కృపాతిశయము గలవాడవు.

కీర్తనలు 145:18

తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు.

ఎఫెసీయులకు 6:18

ఆత్మవలన ప్రతి సమయము నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి.