1సమూయేలు 14: 26
క్రాస్-రిఫరెన్స్‌లు
" జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టియుండెను గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోటపెట్టలేదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంభవించునవి అన్నియు అందరికిని ఏకరీతిగానే సంభవించును; నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించువారికిని బలులనర్పింపని వారికిని గతియొక్కటే; మంచివారికేలాగుననో పాపాత్ములకును ఆలాగుననే తటస్థించును; ఒట్టుపెట్టుకొను వారికేలాగుననో ఒట్టుకు భయపడువారికిని ఆలాగుననే జరుగును.
అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారుకంటెను కోరదగినవి తేనెకంటెను జుంటితేనె ధారలకంటెను మధురమైనవి.
అతిశ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి నేను వారిని పోషించుదును కొండతేనెతో నిన్ను తృప్తిపరచుదును.
అందుకు ప్రధానయాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు నీవన్నట్టే.