1సమూయేలు 14: 40
క్రాస్-రిఫరెన్స్‌లు
" మీరు ఒక తట్టునను నేనును నా కుమారుడగు యోనాతానును ఒక తట్టునను ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమని సౌలుతో చెప్పిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
అతడు నీ మనస్సులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము. నీ యిష్టానుసారముగా నేను నీకు తోడుగా నున్నానని అతనితో చెప్పెను.
అంతట మనము రాత్రియందు ఫిలిష్తీయులను తరిమి తెల్లవారువరకు వారిని కలతపెట్టి, శేషించువాడొకడును లేకుండ చేతము రండి అని సౌలు ఆజ్ఞ ఇయ్యగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమనిరి. అంతట సౌలు యాజకుడు ఇక్కడనే యున్నాడు, దేవుని యొద్ద విచారణ చేయుదము రండని చెప్పి
అందుకు రాజు సేవకులు ఈలాగు మనవి చేసిరి చిత్తగించుము; నీ దాసులమైన మేము మా యేలినవాడవును రాజవునగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా నున్నాము.
ఫిలిష్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును, అబీనాదాబును మల్కీషూవను హతముచేసిరి.
కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ; మడ్డిగల కుండా, మానకుండ మడ్డిగలిగియుండు కుండా, నీకు శ్రమ; చీటి దాని వంతున పడలేదు, వండినదానిని ముక్కవెంబడి ముక్కగా దానిలోనుండి తీసికొనిరమ్ము.
ఈ కుట్రలో చేరినవారు నలుబదిమంది కంటె ఎక్కువ.