లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 14: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఒకదాని కొమ్ము మిక్మషు ఎదుట ఉత్తరపు వైపునను, రెండవదాని కొమ్ము గిబియా యెదుట దక్షిణపు వైపునను ఉండెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 14:4

యోనాతాను ఫిలిష్తీయుల దండు కావలివారున్న స్థలమునకు పోజూచిన దారియగు కనుమల నడుమ ఇవతల ఒక సూది గట్టును అవతల ఒక సూదిగట్టును ఉండెను, వాటిలో ఒకదాని పేరు బొస్సేసు రెండవదాని పేరు సెనే.

1సమూయేలు 13:2

ఇశ్రాయేలీయులలో మూడు వేలమందిని ఏర్పరచుకొనెను. వీరిలో రెండు వేలమంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలునొద్దనుండిరి; వెయ్యిమంది బెన్యామీనీయుల గిబియాలో యోనాతాను నొద్దనుండిరి; మిగిలినవారిని అతడు వారి వారి డేరాలకు పంపివేసెను.

1సమూయేలు 13:11

సమూయేలు అతనితో నీవు చేసిన పని యేమని యడిగెను. అందుకు సౌలు జనులు నాయొద్దనుండి చెదరిపోవుటయు, నిర్ణయకాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడియుండుటయు నేను చూచి

1సమూయేలు 13:23

ఫిలిష్తీయుల దండు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి.

1దినవృత్తాంతములు 3:6

ఇభారు ఎలీషామా ఎలీపేలెటు నోగహు నెపెగు యాఫీయ ఎలీషామా

యెషయా 10:28

అష్షూరీయులు ఆయాతుమీద పడుచున్నారు మిగ్రోను మార్గముగా పోవుచున్నారు మిక్మషులో తమ సామగ్రి ఉంచుచున్నారు