ఆదికాండము 4: 19
క్రాస్-రిఫరెన్స్‌లు
" లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసికొనెను; వారిలో ఒకదాని పేరు ఆదా రెండవదాని పేరు సిల్లా."
సంబంధిత రిఫరెన్స్‌లు
మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను.
కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.
ఆయన సృజించినవాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు
ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా?
కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను.
ఆయనమీ హృదయకాఠిన్యమునుబట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆదినుండి ఆలాగు జరుగలేదు.
నీ భార్య బ్రదికియుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానాచ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లి చేసికొనకూడదు.
వీరిలో ఒకదాని పేరు హన్నా రెండవదాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి.
యెహోయాదా అతనికి యిద్దరు భార్యలను పెండ్లిచేసెను; అతడు కుమారులను కుమార్తెలను కనెను.