ఆదికాండము 4: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరియు సిల్లా తూబల్కయీనును కనెను. అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు. తూబల్కయీను సహోదరి పేరు నయమా."
సంబంధిత రిఫరెన్స్‌లు
మీరు వారియొద్ద తీసికొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి,
మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును
కరవు అనుకొనకుండ నీవు ఆహారము తిను దేశము; అందులో నీకు ఏ లోపముండదు. అది యినుపరాళ్లు గల దేశము; దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును.
నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై యుండును. నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును.
నా తండ్రియైన దావీదు నియమించి యూదాదేశములోను యెరూషలేములోను నాయొద్ద ఉంచిన ప్రజ్ఞగలవారికి సహాయకుడైయుండి, బంగారముతోను వెండితోను ఇత్తడితోను ఇనుముతోను ఊదా నూలుతోను ఎఱ్ఱ నూలుతోను నీలి నూలుతోను చేయు పనియును అన్ని విధముల చెక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞగల మనుష్యునొకని నాయొద్దకు పంపుము.
ఇనుమును మంటిలోనుండి తీయుదురు రాళ్లు కరగించి రాగి తీయుదురు.