లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 50: 8

క్రాస్-రిఫరెన్స్‌లు

" యోసేపు యింటివారందరును అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారును వెళ్లిరి. వారు తమ పిల్లలను తమ గొఱ్ఱల మందలను తమ పశువులను మాత్రము గోషెను దేశములో విడిచిపెట్టిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 10:8

మోషే అహరోనులు ఫరోయొద్దకు మరల రప్పింపబడగా అతడు మీరు వెళ్లి మీ దేవుడైన యెహోవాను సేవించుడి; అందుకు ఎవరెవరు వెళ్లుదురని వారినడిగెను.

నిర్గమకాండము 10:9

అందుకు మోషే మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతోకూడ వెళ్లెదమనెను

నిర్గమకాండము 10:26

మా పశువులును మాతోకూడ రావలెను. ఒక డెక్కయైనను విడువబడదు, మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలోనుండి తీసికొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరకమునుపు మాకు తెలియదనెను.

సంఖ్యాకాండము 32:24

మీరు మీ పిల్లలకొరకు పురములను మీ మందలకొరకు దొడ్లను కట్టుకొని మీ నోటనుండి వచ్చిన మాటచొప్పున చేయుడనెను.

సంఖ్యాకాండము 32:25

అందుకు గాదీయులును రూబేనీయులును మోషేతో మా యేలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసెదము.

సంఖ్యాకాండము 32:26

మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురములలో ఉండును.

సంఖ్యాకాండము 32:27

నీ దాసులమైన మేము, అనగా మా సేనలో ప్రతి యోధుడును మా యేలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యొర్దాను అవతలికి వచ్చెదమనిరి.

ఆదికాండము 43:8

యూదా తన తండ్రియైన ఇశ్రాయేలును చూచి ఆ చిన్న వానిని నాతో కూడ పంపుము, మేము లేచి వెళ్లుదుము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలును చావక బ్రదుకుదుము;