ఆదికాండము 7: 19
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును వాటిని ప్రవహింపనియ్యగా అవి భూమిని ముంచివేయును.
కావున భూమి మార్పునొందినను నడిసముద్రములలో పర్వతములు మునిగినను
వాటి జలములు ఘోషించుచు నురుగుకట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము.(సెలా.)
దానిమీద అగాధజలములను నీవు వస్త్రమువలె కప్పితివి. కొండలకుపైగా నీళ్లు నిలిచెను.
నీవు గద్దింపగానే అవి పారిపోయెను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను.
నీవు వాటికి నియమించినచోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను పల్లములకు దిగెను.
అవి మరలివచ్చి భూమిని కప్పకయుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి.
నిశ్చయముగా కొండలమీద జరిగినది మోసకరము, పర్వతములమీద చేసిన ఘోష నిష్‌ప్రయోజనము, నిశ్చయముగా మా దేవుడైన యెహోవావలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును.
ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను.
మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.