లేఖనాలను అన్వేషించండి

యోబు 39: 18

క్రాస్-రిఫరెన్స్‌లు

" అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్కరించును."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 39:7

పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు.

యోబు 39:22

అది భయము పుట్టించుదానిని వెక్కిరించి భీతినొందకుండును ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు.

యోబు 5:22

పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసికొనియుందువు అడవిమృగములు నీతో సమ్మతిగానుండును.

యోబు 41:29

దుడ్డుకఱ్ఱలు గడ్డిపరకలుగా ఎంచబడును అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును.

2రాజులు 19:21

అతనిగూర్చి యెహోవా సెలవిచ్చుమాట యేదనగా సీయోను కుమారియైన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది; నిన్ను అపహాస్యము చేయుచున్నది; యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది.