లేవీయకాండము 14: 23
క్రాస్-రిఫరెన్స్‌లు
" వాడు పవిత్రతపొంది ఎనిమిదవనాడు యెహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యాజకునియొద్దకు వాటిని తీసికొనిరావలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటితో ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను.
ఎనిమిదవ దినమున మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించి
ఎనిమిదవనాడు వాడు నిర్దోషమైన రెండు మగ గొఱ్ఱపిల్లలను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱపిల్లను నైవేద్యమునకై నూనె కలిసిన మూడు పదియవ వంతుల గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను తీసికొనిరావలెను.
ఎనిమిదవ దినమున అతడు రెండు తెల్లగువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న యాజకుని యొద్దకు తేవలెను.