లేఖనాలను అన్వేషించండి

లేవీయకాండము 14: 51

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసికొని వధింపబడిన పక్షిరక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ యింటిమీద ఏడు మారులు ప్రోక్షింపవలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 14:6

సజీవమైన పక్షిని ఆ దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సోపును తీసికొని పారు నీటిపైని చంపిన పక్షిరక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి

లేవీయకాండము 14:7

కుష్ఠు విషయములో పవిత్రత పొందగోరువానిమీద ఏడుమారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను.

2రాజులు 5:10

ఎలీషా నీవు యొర్దానునదికి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్లు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను.

హెబ్రీయులకు 9:22

మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.