లేఖనాలను అన్వేషించండి

లూకా 15: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాననెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

లూకా 15:6

మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొఱ్ఱ దొరకినదని వారితో చెప్పును గదా.

లూకా 15:7

అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిదిమంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొకమందు ఎక్కువ సంతోషము కలుగును

మీకా 7:18

తన స్వాస్థ్యములో శేషించినవారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు.

లూకా 10:21

ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి-తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను; అవును తండ్రీ, ఆలాగు నీ దృష్టికి అనుకూలమాయెను.

లూకా 15:24

ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను; అంతట వారు సంతోషపడసాగిరి.

యోహాను 15:11

మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను.