లూకా 15: 9
క్రాస్-రిఫరెన్స్‌లు
" అది దొరకినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడ సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణము దొరకినదని వారితో చెప్పును గదా."
సంబంధిత రిఫరెన్స్‌లు
అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడిదాసులలో ఒకనిని చూచి, వాని గొంతుపట్టుకొని నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను
నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.
తమ గొఱ్ఱలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొఱ్ఱలను వెదకి, చీకటిగల మబ్బుదినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడనుండి నేను వాటిని తప్పించి
ఈ దొడ్డివి కాని వేరే గొఱ్ఱలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱల కాపరి ఒక్కడును అగును.
యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను.
మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.
ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను; అంతట వారు సంతోషపడసాగిరి.