లేఖనాలను అన్వేషించండి

లూకా 15: 4

క్రాస్-రిఫరెన్స్‌లు

" మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱలు కలిగియుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయినది దొరకువరకు దానిని వెదక వెళ్లడా?"

సంబంధిత రిఫరెన్స్‌లు

యెషయా 53:6

మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.

యెషయా 65:19

నేను యెరూషలేమునుగూర్చి ఆనందించెదను నా జనులనుగూర్చి హర్షించెదను రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను వినబడవు.

మత్తయి 9:13

అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను

మత్తయి 10:6

ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱలయొద్దకే వెళ్లుడి.

మత్తయి 13:3

ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమానరీతిగా చెప్పెను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్లెను.

యోహాను 21:16

మరల ఆయన యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని రెండవసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; ఆయన నా గొఱ్ఱలను కాయుమని చెప్పెను.

అపోస్తలులకార్యములు 21:20

వారు విని దేవుని మహిమపరచి అతని చూచి సహోదరుడా, యూదులలో విశ్వాసులైనవారు ఎన్ని వేలమంది యున్నారో చూచుచున్నావుగదా? వారందరును ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు.