లేఖనాలను అన్వేషించండి

మత్తయి 23: 22

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు ఆకాశము తోడని ఒట్టుపెట్టుకొనువాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైని కూర్చున్నవాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు."

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 8:13

నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించియున్నాను; సదాకాలము అందులో నీవు నివసించుటకై నేనొకస్థలము ఏర్పరచియున్నాను అని చెప్పి

1రాజులు 8:27

నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును?

2దినవృత్తాంతములు 6:2

నీవు నిత్యము కాపురముండుటకై నిత్యనివాసస్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించియున్నాను అని చెప్పి

2దినవృత్తాంతములు 7:2

యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి.

కీర్తనలు 26:8

యెహోవా, నీ నివాసమందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను.

కీర్తనలు 132:13

యెహోవా సీయోనును ఏర్పరచుకొనియున్నాడు. తనకు నివాసస్థలముగా దానిని కోరుకొనియున్నాడు.

కీర్తనలు 132:14

ఇది నేను కోరినస్థానము, ఇది నిత్యము నాకు విశ్రమస్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించెదను

ఎఫెసీయులకు 2:22

ఆయనలో మీరు కూడ ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.

కొలొస్సయులకు 2:9

ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది;

కీర్తనలు 11:4

యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యెహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు.

యెషయా 66:1

యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించునది ఏపాటిది?