లేఖనాలను అన్వేషించండి

1రాజులు 16: 20

క్రాస్-రిఫరెన్స్‌లు

" జిమీ చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన రాజద్రోహమునుగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది."

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 16:5

బయెషా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటినిగూర్చియు, అతని బలమునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

1రాజులు 16:14

ఏలా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన క్రియలన్నిటినిగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

1రాజులు 16:27

ఒమీ చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు అగుపరచిన బలమునుగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

1రాజులు 14:19

యరొబాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు జరిగించిన యుద్ధములనుగూర్చియు, ప్రభుత్వమునుగూర్చియు ఇశ్రాయేలువారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

1రాజులు 15:31

నాదాబు చేసిన ఇతర కార్యములనుగూర్చియు, అతడు చేసినదాని నంతటినిగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

1రాజులు 22:39

అహాబు చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన దానంతటినిగూర్చియు, అతడు కట్టించిన దంతపు ఇంటినిగూర్చియు, అతడు కట్టించిన పట్టణములనుగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

1దినవృత్తాంతములు 2:6

జెరహు కుమారులు అయిదుగురు, జిమీ ఏతాను హేమాను కల్కోలు దార.