లేఖనాలను అన్వేషించండి

1రాజులు 16: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" బయెషా తన పితరులతో కూడ నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను; అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 14:20

యరొబాము ఏలిన దినములు ఇరువదిరెండు సంవత్సరములు; అతడు తన పితరులతో కూడ నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయెను.

1రాజులు 15:25

యరొబాము కుమారుడైన నాదాబు యూదారాజైన ఆసా యేలుబడిలో రెండవ సంవత్సరమందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలువారిని రెండు సంవత్సరములు ఏలెను.

1రాజులు 14:17

అప్పుడు యరొబాము భార్య లేచి వెళ్లిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను; ఆమె లోగిటి ద్వారపు గడపయొద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయెను.

1రాజులు 15:21

అది బయెషాకు వర్తమానము కాగా రామా పట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసము చేసెను.

1రాజులు 16:8

యూదా రాజైన ఆసా యేలుబడిలో ఇరువదియారవ సంవత్సరమున బయెషా కుమారుడైన ఏలా తిర్సాయందు ఇశ్రాయేలువారినందరిని ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను.

1రాజులు 16:13

వారు చేసిన పాపములనుబట్టి ప్రవక్తయైన యెహూద్వారా బయెషానుగూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమీ బయెషా సంతతివారి నందరిని నాశనము చేసెను.

1రాజులు 16:14

ఏలా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన క్రియలన్నిటినిగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

1రాజులు 11:43

అంతట సొలొమోను తన పితరులతో కూడ నిద్రించి, తన తండ్రియైన దావీదు పురమందు సమాధి చేయబడెను; తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను.

1రాజులు 16:28

ఒమీ తన పితరులతో కూడ నిద్రించి షోమ్రోనులో సమాధియందు పాతిపెట్టబడెను, అతని కుమారుడైన అహాబు అతనికి మారుగా రాజాయెను.

కీర్తనలు 49:19

అతడు తన పితరుల తరమునకు టొరవలెను వారు మరి ఎన్నడును వెలుగుచూడరు.