లేఖనాలను అన్వేషించండి

2రాజులు 6: 1

క్రాస్-రిఫరెన్స్‌లు

" అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చి ఇదిగో నీయొద్ద మాకున్న స్థలము ఇరుకుగా నున్నది;"

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 2:3

బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చి నేడు యెహోవా నీయొద్దనుండి నీ గురువును పరమునకు తీసికొనిపోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు నేనెరుగుదును,మీరు ఊరకుండుడనెను.

2రాజులు 4:1

అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవా యందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొనిపోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొఱ్ఱపెట్టగా

1రాజులు 20:35

అంతట ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞచేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు

2రాజులు 4:38

ఎలీషా గిల్గాలునకు తిరిగిరాగా ఆ దేశమందు క్షామము కలిగియుండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండియుండగా అతడు తన పనివానిని పిలిచి పెద్దకుండ పొయిమీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూరవంట చేయుమని సెలవిచ్చెను.

1సమూయేలు 19:20

దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను; వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు, సమూయేలు వారిమీద నాయకుడుగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతలమీదికి వచ్చెను గనుక వారును ప్రకటింప నారంభించిరి.

యెహోషువ 17:14

అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతోమా కేల ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి? మేము ఒక గొప్ప జనమేగదా? ఇదివరకు యెహోవా మమ్మును దీవించెనని మనవిచేయగా

యెహోషువ 19:47

దానీ యుల సరిహద్దు వారియొద్దనుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషెముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరునుబట్టి ఆ లెషెమునకు దానను పేరు పెట్టిరి.

యోబు 36:16

అంతియేకాక బాధలోనుండి ఆయన నిన్ను తప్పించును. ఇరుకులేని విశాలస్థలమునకు నిన్ను తోడుకొనిపోవును నీ ఆహారమును క్రొవ్వుతో నింపును.

యెషయా 49:19

నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లును బీటి స్థలములును నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును నిన్ను మింగివేసినవారు దూరముగా ఉందురు.

యెషయా 49:20

నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది. ఇంక విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు.

యెషయా 54:2

నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగుచేయుము నీ మేకులను దిగగొట్టుము.

యెషయా 54:3

కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును.

1సమూయేలు 10:5

ఈలాగున పోవుచు ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు, అచ్చట ఊరిదగ్గరకు నీవు రాగానే, స్వరమండలము తంబుర సన్నాయి సితారా వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలమునుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును, వారు ప్రకటన చేయుచు వత్తురు;

2రాజులు 2:15

యెరికో దగ్గరనుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలీయా ఆత్మ ఎలీషామీద నిలిచియున్నదని చెప్పుకొని, అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి

2రాజులు 9:1

అంతట ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకనిని పిలువనంపించి అతనితో ఇట్లనెను నీవు నడుము బిగించుకొని యీ తైలపుగిన్నె చేతపట్టుకొని రామోత్గిలాదునకు పోయి

ఆమోసు 2:11

మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ యౌవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించితిని. ఇశ్రాయేలీయులారా, యీ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు.

ఆమోసు 7:14

అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కాని పసుల కాపరినై మేడిపండ్లు ఏరుకొనువాడను.

యోహాను 21:3

సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడ వచ్చెదమనిరి. వారు వెళ్లి దోనె ఎక్కిరి కాని ఆ రాత్రి యేమియు పట్టలేదు.