లేఖనాలను అన్వేషించండి

2రాజులు 6: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడ నీవు రావలెనని కోరగా అతడు నేను వచ్చెదనని చెప్పి"

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 5:23

అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసికొనుమని బతిమాలి, రెండు సంచులలో నాలుగు మణుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి, తన పనివారిలో ఇద్దరిమీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసికొనిపోయిరి.

న్యాయాధిపతులు 19:6

తన అల్లునితో అనగా, వారిద్దరు కూర్చుండి అన్న పానములు పుచ్చుకొనిరి. తరువాత ఆ చిన్నదాని తండ్రిదయచేసి యీ రాత్రి అంతయు ఉండి సంతోషపడుము, నీ హృదయమును సంతోషపరచుకొనుము అని ఆ మను ష్యునితో చెప్పి

యోబు 6:28

దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా?

న్యాయాధిపతులు 4:8

బారాకు నీవు నాతోకూడ వచ్చినయెడల నేను వెళ్లెదను గాని నీవు నాతో కూడ రానియెడల నేను వెళ్లనని ఆమెతో చెప్పెను.