లేఖనాలను అన్వేషించండి

2రాజులు 6: 20

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా, వీరు చూచునట్లు వీరి కండ్లను తెరువుమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవచేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలిసికొనిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 6:17

యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను.

లూకా 24:31

వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.

న్యాయాధిపతులు 20:40

అయితే పట్టణమునుండి ఆకాశముతట్టు స్తంభ రూపముగా పొగ పైకిలేవ నారంభింపగా బెన్యామీనీ యులు వెనుకతట్టు తిరిగి చూచిరి. అప్పుడు ఆ పట్టణ మంతయు ధూమమయమై ఆకాశమునకెక్కుచుండెను.

న్యాయాధిపతులు 20:41

ఇశ్రాయేలీయులు తిరిగినప్పుడు బెన్యామీనీయులు తమకు అపజయము కలిగినదని తెలిసికొని విభ్రాంతినొంది

న్యాయాధిపతులు 20:42

యెడారి మార్గముతట్టు వెళ్లుదమని ఇశ్రాయేలీయుల యెదుట వెనుకకు తిరిగిరిగాని, యుద్ధమున తరుమబడగా పట్టణము లలోనుండి వచ్చినవారు మధ్య మార్గమందే వారిని చంపిరి.

లూకా 16:23

అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి

ఆదికాండము 3:7

అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి.

2రాజులు 4:33

తానే లోపలికిపోయి వారిద్దరే లోపలనుండగా తలుపువేసి, యెహోవాకు ప్రార్థనచేసి