2రాజులు 6: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా యేలినవాడా, అది యెరవు తెచ్చినదని మొఱ్ఱపెట్టెను గనుక"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయనియెడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను; అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము.
ఆయన అడవిపొదలను ఇనుపకత్తితో కొట్టివేయును లెబానోను బలవంతుడైన యొకనిచేత కూలిపోవును.
దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుఱ్ఱములును రథములును గల సైన్యము పట్టణమును చుట్టుకొనియుండుట కనబడెను. అంతట అతని పనివాడు అయ్యో నా యేలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా
ఇశ్రాయేలు రాజు కటకటా ముగ్గురు రాజులమైన మనలను మోయాబీయులచేతికి అప్పగింపవలెనని యెహోవా మనలను పిలిచెననగా
దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు--అయ్యో, అయ్యో, బబులోను మహా పట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెనుగదా అని చెప్పుకొందురు.
అయ్యో, అయ్యో, సన్నపు నారబట్టలను ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహా పట్టణమా, యింత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడై పోయెనే అని చెప్పుకొనుచు దాని భాదను చూచి భయక్రాంతులై దూరముగా నిలుచుందురు
తమ తలలమీద దుమ్ము పోసికొని యేడ్చుచు దుఃఖించుచు అయ్యో, అయ్యో, ఆ మహా పట్టణము; అందులో సముద్రముమీద ఓడలుగల వారందరు, దానియందలి అధిక వ్యయముచేత ధనవంతులైరి; అది ఒక్క గడియలో పాడైపోయెనే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి.
ఆమె దైవజనుడైన అతనియొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలినదానితో నీవును నీ పిల్లలును బ్రదుకుడని ఆమెతో చెప్పెను.
ఒకడు తన పొరుగువానియొద్ద దేనినైనను బదులు దీసికొనిపోగా దాని యజమానుడు దానియొద్ద లేనప్పుడు, అది హానిపొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను.
దాని యజమానుడు దానితో నుండినయెడల దాని నష్టమును అచ్చుకొన నక్కరలేదు. అది అద్దెదైనయెడల అది దాని అద్దెకు వచ్చెను.
భక్తిహీనులు అప్పుచేసి తీర్చకయుందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు.
పొరబాటున వాని చంపినయెడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితోకూడ అడవికిపోయి చెట్లు నరుకుటకు తనచేతితో గొడ్డలిదెబ్బ వేసినప్పుడు, గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోయినయెడల, వాడు అంతకుముందు తన పొరుగువానియందు పగపట్టలేదు గనుక