2రాజులు 6: 26
క్రాస్-రిఫరెన్స్‌లు
" అంతట ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారముమీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజవైన నా యేలినవాడా, సహాయము చేయుమని కేకలు వేయుట విని"
సంబంధిత రిఫరెన్స్‌లు
కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునొద్దకువచ్చి సాగిలపడి సమస్కారము చేసి రాజా రక్షించుమనగా
దర్శనదినమున దూరమునుండి వచ్చు ప్రళయదినమున మీరేమి చేయుదురు? సహాయమునొందుటకు ఎవరియొద్దకు పారిపోవుదురు? మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకొందురు?
ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతనియొద్దకు తరచుగావచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను గాని
ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి; ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసుదేశస్థులను దేవాలయములోనికి తీసికొనివచ్చి యీ పరిశుద్ద స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలు వేసిరి
ఆ సంవత్సరము గతించిన తరువాత రెండవ సంవత్సరమున వారు అతనియొద్దకు వచ్చి ఇది మా యేలినవారికి మరుగుచేయము; ద్రవ్యము వ్యయమైపోయెను, పశువుల మందలును ఏలినవారి వశమాయెను, ఇప్పుడు మా దేహములును మా పొలములును తప్ప మరి ఏమియు ఏలినవారి సముఖమున మిగిలియుండలేదు.
ఎలీషా నావలన నీకేమి కావలెను? నీ యింటిలో ఏమి యున్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె నీ దాసురాలనైన నా యింటిలో నూనెకుండ యొకటియున్నది; అది తప్ప మరేమియు లేదనెను.
అయితే ఆ యేడు సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశములోనుండి వచ్చి తన యింటినిగూర్చియు భూమినిగూర్చియు మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను.
అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగిరప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రదికించిన బిడ్డ తల్లి తన యింటినిగూర్చియు భూమినిగూర్చియు రాజుతో మనవిచేయ వచ్చెను. అంతట గేహజీ నా యేలినవాడవైన రాజా ఆ స్త్రీ యిదే; మరియు ఎలీషా తిరిగి బ్రదికించిన యీమె బిడ్డ వీడే అని చెప్పగా
నేను మనుష్యుని గురించి మొఱ్ఱపెట్టుకొన్నానా? లేదు గనుక నేను ఏల ఆతురపడకూడదు?
ఆయన ఆయాసము చేత క్రుంగజేసెను. వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను.
వారు తమ కూమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసెదను; తమ ప్రాణము తీయ వెదకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకై వేయు ముట్టడినిబట్టియు దానివలన కలిగిన యిబ్బందినిబట్టియు వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును.
నక్కలైనను చన్నిచ్చి తమపిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి యెడారిలోని ఉష్ట్రపక్షులవలె క్రూరురాలాయెను.
వాత్సల్యముగల స్త్రీలచేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి.