లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 25: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" అందుకు పౌలు కైసరు న్యాయపీఠము ఎదుట నిలువబడియున్నాను; నేను విమర్శింపబడవలసిన స్థలమిదే, యూదులకు నేను అన్యాయమేమియు చేయలేదని తమరికి బాగుగా తెలియును."

సంబంధిత రిఫరెన్స్‌లు

అపోస్తలులకార్యములు 25:3

మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండి మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనినిగూర్చి ఫేస్తు నొద్ద మనవి చేసిరి.

అపోస్తలులకార్యములు 25:20

ఆ యేసు బ్రదికియున్నాడని పౌలు చెప్పెను. నేనట్టి వాదముల విషయమై యేలాగున విచారింపవలెనో యేమియు తోచక, యెరూషలేమునకు వెళ్లి అక్కడ వీటినిగూర్చి విమర్శింపబడుటకు అతని కిష్టమవునేమో అని అడిగితిని.

అపోస్తలులకార్యములు 12:3

ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురునుకూడ పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు.

అపోస్తలులకార్యములు 24:27

రెండు సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్సు యూదులచేత మంచివాడనిపించుకొనవలెనని కోరి, పౌలును బంధకములలోనే విడిచిపెట్టిపోయెను.

మార్కు 15:15

పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదలచేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.

నిర్గమకాండము 23:2

దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యెములో సాక్ష్యము పలుకకూడదు;

దానియేలు 6:16

అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొనిపోయి సింహముల గుహలో పడద్రోసిరి; పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను.

మత్తయి 27:15

జనులు కోరుకొనిన యొక ఖయిదీని పండుగలో విడుదలచేయుట అధిపతికి వాడుక.

మార్కు 15:6

ఆ పండుగలో వారు కోరుకొనిన యొక ఖయిదీని పిలాతు విడిపించువాడు.

అపోస్తలులకార్యములు 12:11

పేతురుకు తెలివివచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలోనుండియు, యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటినుండియు నన్ను తప్పించియున్నాడని యిప్పుడు నాకు నిజముగా తెలియునని అనుకొనెను.

అపోస్తలులకార్యములు 18:22

తరువాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్లి సంఘపువారిని కుశలమడిగి, అంతియొకయకు వచ్చెను.

అపోస్తలులకార్యములు 21:15

ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసికొని యెరూషలేమునకు ఎక్కిపోతివిు.

అపోస్తలులకార్యములు 26:17

నేను ఈ ప్రజలవలనను అన్యజనులవలనను హాని కలుగకుండ నిన్ను కాపాడెదను;