లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 25: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధానయాజకులును యూదుల పెద్దలును అతనిమీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

అపోస్తలులకార్యములు 24:27

రెండు సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్సు యూదులచేత మంచివాడనిపించుకొనవలెనని కోరి, పౌలును బంధకములలోనే విడిచిపెట్టిపోయెను.

అపోస్తలులకార్యములు 23:24

మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసెను

అపోస్తలులకార్యములు 26:29

అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో, తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలె ఉండునట్లు దేవుడనుగ్రహించుగాక అనెను.

2కొరిందీయులకు 6:9

మేము మోసగాండ్రమైనట్లుండియు సత్యవంతులము; తెలియబడనివారమైనట్లుండియు బాగుగ తెలియబడినవారము; చనిపోవుచున్నవారమైనట్లుండియు ఇదిగో బ్రదుకుచున్నవారము; శిక్షింపబడినవారమైనట్లుండియు చంపబడనివారము;

2కొరిందీయులకు 11:23

వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడుచున్నాను, నేనును మరియెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరివిశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.