లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 25: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండి మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనినిగూర్చి ఫేస్తు నొద్ద మనవి చేసిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

అపోస్తలులకార్యములు 25:15

నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధానయాజకులును యూదుల పెద్దలును అతనిమీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి.

అపోస్తలులకార్యములు 24:1

అయిదు దినములైన తరువాత ప్రధానయాజకుడైన అననీయయు, కొందరు పెద్దలును, తెర్తుల్లు అను ఒక న్యాయవాదియు కైసరయకు వచ్చి, పౌలుమీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి.

యోబు 31:31

అతడు పెట్టిన భోజనము తిని, తృప్తి పొందనివానిని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకనియెడలను

సామెతలు 4:16

అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు.

రోమీయులకు 3:12

అందరును త్రోవతప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు.

రోమీయులకు 3:13

వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు; వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది

రోమీయులకు 3:14

వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి.

రోమీయులకు 3:15

రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి.

రోమీయులకు 3:16

నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి.

రోమీయులకు 3:17

శాంతిమార్గము వారెరుగరు.

రోమీయులకు 3:18

వారి కన్నులయెదుట దేవుని భయము లేదు.

రోమీయులకు 3:19

ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైనవారితో చెప్పుచున్నదని యెరుగుదుము.

యిర్మియా 26:11

యాజకులును ప్రవక్తలును అధిపతులతోను సమస్త ప్రజలతోను ఈలాగనిరి మీరు చెవులార వినియున్న ప్రకారము, ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు; గనుక ఇతడు మరణమునకు పాత్రుడు.

లూకా 21:12

ఇవన్నియు జరుగకమునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి, నా నామము నిమిత్తము మిమ్మును రాజులయొద్దకును అధిపతులయొద్దకును తీసికొనిపోయి, సమాజమందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు.

అపోస్తలులకార్యములు 23:12

ఈ కుట్రలో చేరినవారు నలుబదిమంది కంటె ఎక్కువ.

అపోస్తలులకార్యములు 25:24

అప్పుడు ఫేస్తు అగ్రిప్పరాజా, యిక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుష్యుని చూచుచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరు వీడు ఇక బ్రదుక తగడని కేకలు వేయుచు అతనిమీద నాతొ మనవి చేసికొనిరి

రోమీయులకు 15:31

నేను దేవుని చిత్తమువలన సంతోషముతో మీయొద్దకు వచ్చి, మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును,