యోహాను 20: 1
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధిమీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను. "
సంబంధిత రిఫరెన్స్‌లు
నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొనియున్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసియున్నావు.
అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు.
యోనా మూడు రాత్రింబగళ్లు తివిుంగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును.
వారు ఆయననుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రానుమీదనుండి దింపి సమాధిలో పెట్టిరి.
లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను.
మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలోనుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడ లేచితిరి.
ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము; అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా
ఆ దినము సిద్ధపరచు దినము; మరుసటి విశ్రాంతిదినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతిదినమున సిలువమీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి.
అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటిమీద నూనె పోయవలెను.
అత్తరు పనివారిచేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోను పరిమళద్రవ్యములతోను నిండిన పడకమీద జనులు అతని ఉంచి, అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి, దావీదు పట్టణమందు అతడు తనకొరకై తొలిపించుకొనిన సమాధియందు అతని పాతిపెట్టిరి.
మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధానయాజకులును పరిసయ్యులును పిలాతు నొద్దకు కూడివచ్చి
ఆ దినము సిద్ధపరచు దినము; విశ్రాంతి దినారంభము కావచ్చెను.