యోహాను 20: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" తెల్లని వస్త్రములు ధరించిన యిద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్లవైపున ఒకడును కూర్చుండుట కనబడెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, సలోమేయు ఉండిరి.
అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి, తెల్లని నిలువుటంగీ ధరించుకొనియున్న యొక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి.
ఇందునుగూర్చి వారికేమియు తోచకయుండగా, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలువబడిరి.
ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు యోహన్నయు యాకోబు తల్లియైన మరియయు వారితో కూడ ఉన్న యితర స్త్రీలును.
నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము ధుఃఖముతో నిండియున్నది.
ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువయొద్ద నిలుచుండిరి.