యెహోషువ 15: 3
క్రాస్-రిఫరెన్స్‌లు
" అది అక్రబ్బీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీనువరకు పోయి కాదేషు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోనువరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయువైపు తిరిగి"
సంబంధిత రిఫరెన్స్‌లు
మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రముయొక్క తూర్పు తీరమువరకు ఉండును. మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రబ్బీము కనమయొద్ద తిరిగి సీనువరకు వ్యాపించును. అది దక్షిణమునుండి కాదేషు బర్నేయవరకు వ్యాపించి, అక్కడనుండి హసరద్దారువరకు పోయి, అక్కడనుండి అస్మోనువరకు సాగును.
అమోరీయుల సరి హద్దు అక్రబ్బీము మొదలుకొని హస్సెలావరకు వ్యాపించెను.
తిరిగి కాదేషను ఏన్మిష్పతుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని హససోన్ తామారులో కాపురమున్న అమోరీయులను కూడ కొట్టిరి.
మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను.
ఆ దేశమును చూచుటకు కాదేషు బర్నేయలోనుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును ఆలాగు చేసిరిగదా
మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రముయొక్క తూర్పు తీరమువరకు ఉండును. మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రబ్బీము కనమయొద్ద తిరిగి సీనువరకు వ్యాపించును. అది దక్షిణమునుండి కాదేషు బర్నేయవరకు వ్యాపించి, అక్కడనుండి హసరద్దారువరకు పోయి, అక్కడనుండి అస్మోనువరకు సాగును.
మోషే కనానుదేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణదిక్కున ప్రవేశించి ఆ కొండయెక్కి ఆ దేశము ఎట్టిదో