యెహోషువ 15: 55
క్రాస్-రిఫరెన్స్‌లు
" మాయోను కర్మెలు జీఫు యుట్టయెజ్రెయేలు"
సంబంధిత రిఫరెన్స్‌లు
సౌలును అతని జనులును తన్ను వెదకుటకై బయలుదేరిన మాట దావీదు విని, కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరుమ బోయెను.
కర్మెలులోని మాయోనునందు ఆస్తిగలవాడొకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు, అతనికి మూడువేల గొఱ్ఱలును వెయ్యి మేకలును ఉండెను. అతడు కర్మెలులో తన గొఱ్ఱల బొచ్చు కత్తిరించుటకై పోయియుండెను.
నీయొద్ద గొఱ్ఱలబొచ్చు కత్తిరించువారున్నారను సంగతి నాకు వినబడెను; నీ గొఱ్ఱకాపరులు మా దగ్గరనుండగా మేము వారికి ఏ కీడును చేసియుండలేదు; వారు కర్మెలులో నున్నంతకాలము వారేదియు పోగొట్టుకొనలేదు;
అదియుగాక షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్షగలవాడు గనుక పర్వతములలోను కర్మెలులోను అతనికి వ్యవసాయకులును ద్రాక్షతోట పనివారును కలిగియుండిరి.
అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.
అహాబు భోజనము చేయబోయెను గాని, ఏలీయా కర్మెలు పర్వతముమీదికి పోయి నేలమీద పడి ముఖము మోకాళ్లమధ్య ఉంచుకొనెను.
హాసోరు యిత్నాను జీఫు
అయితే దావీదు అరణ్యములోని కొండస్థలముల యందును, జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను; సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలు చేతికి అతని నప్పగించలేదు.
తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరెనని తెలిసికొని దావీదు జీఫు అరణ్యములో ఒక వనమున దిగెను.
అంతట జీఫీయులు గిబియాలో సౌలునొద్దకు వచ్చి దావీదు యెషీమోను ఎదుట హకీలా మన్యములో దాగియున్నాడని తెలియజేయగా
సౌలు లేచి ఇశ్రాయేలీయులలో ఏర్పరచబడిన మూడువేల మందిని తీసికొని జీఫు అరణ్యములో దావీదును వెదకుటకు జీఫు అరణ్యమునకు పోయెను.
కర్మెలులొ యొక్నెయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు,
అనగా ఆ రెండు గోత్రములవారినుండి తొమ్మిది పట్టణములను ఇచ్చిరి.
సీదోనీయు లును అమాలేకీయులును మాయోనీయులును మిమ్మును బాధ పరచినప్పుడు వారి వశములోనుండియు నేను మిమ్మును రక్షిం చితిని గదా
ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయెనన్న సమాచారము వినెను.
అంతట వారు లేచి సౌలుకంటె ముందు జీఫునకు తిరిగివెళ్లిరి. దావీదును అతని జనులును యెషీమోనుకు దక్షిణపు వైపుననున్న మైదానములోని మాయోను అరణ్యములో ఉండగా
మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు.