లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 15: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" మీయొద్ద నివసించు పరదేశిగాని మీ తర తరములలో మీ మధ్యనున్న వాడెవడుగాని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము అర్పింపగోరినప్పుడు మీరు చేయునట్లే అతడును చేయవలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 22:18

నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను ఇట్లు చెప్పుము ఇశ్రాయేలీయుల యింటివారిలోనేగాని ఇశ్రాయేలీయులలో నివసించు పరదేశులలోనేగాని యెవడు యెహోవాకు దహనబలిగా స్వేచ్ఛార్పణములనైనను మ్రొక్కుబళ్లనైనను అర్పించునో

లేవీయకాండము 22:25

పరదేశి చేతినుండి అట్టివాటిలో దేనిని తీసికొని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు; అవి లోపము గలవి, వాటికి కళంకములుండును, అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము.