లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 15: 27

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఒకడు పొరబాటున పాపము చేసినయెడల వాడు పాపపరిహారార్థబలిగా ఏడాది ఆడు మేకపిల్లను తీసికొనిరావలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 4:27

మీ దేశస్థులలో ఎవడైనను పొరబాటున పాపము చేసి చేయరాని పనుల విషయములో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధియైనయెడల

లేవీయకాండము 4:28

తాను చేసినది పాపమని యొకవేళ తనకు తెలియబడినయెడల, తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసికొనివచ్చి

అపోస్తలులకార్యములు 3:17

సహోదరులారా, మీరును మీ అధికారులును తెలియక చేసితిరని నాకు తెలియును.

అపోస్తలులకార్యములు 17:30

ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.

1తిమోతి 1:13

నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తుయేసుకు కృతజ్ఞుడనై యున్నాను. తెలియక అవిశ్వాసమువలన చేసితిని గనుక కనికరింపబడితిని.

కీర్తనలు 51:16

నీవు బలిని కోరువాడవు కావు కోరినయెడల నేను అర్పించుదును దహనబలి నీకిష్టమైనది కాదు.