లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 22: 21

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంతకట్టి మోయాబు అధికారులతో కూడ వెళ్లెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 1:15

నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడువకుండ నీ పాదము వెనుకకు తీసికొనుము.

సామెతలు 1:16

కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు.

సంఖ్యాకాండము 16:15

అందుకు మోషే మిక్కిలి కోపించి నీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకుము. ఒక్క గాడిదనైనను వారియొద్ద నేను తీసికొనలేదు; వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యెహోవాయొద్ద మనవిచేసెను.

సంఖ్యాకాండము 22:35

యెహోవా దూత నీవు ఆ మనుష్యులతో కూడ వెళ్లుము. అయితే నేను నీతో చెప్పు మాటయేకాని మరేమియు పలుకకూడదని బిలాముతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడ వెళ్లెను.

1రాజులు 13:13

పిమ్మట అతడు తన కుమారులను పిలిచి నాకొరకు గాడిదకు గంతకట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంతకట్టిరి. అతడు దానిమీద ఎక్కి దైవజనుని కనుగొనవలెనని పోయి