లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 22: 38

క్రాస్-రిఫరెన్స్‌లు

" అందుకు బిలాము ఇదిగో నీయొద్దకు వచ్చితిని; అయిన నేమి? ఏదైనను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 22:18

అందుకు బిలాము బాలాకు తన యింటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్దిపనినైనను గొప్పపనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటిమాట మీరలేను.

కీర్తనలు 33:10

అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా జేయును.

కీర్తనలు 76:10

నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు.

సామెతలు 19:21

నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవా యొక్క తీర్మానమే స్థిరము.

యెషయా 44:25

నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను సోదెకాండ్రను వెఱ్ఱివారినిగా చేయువాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే.

యెషయా 46:10

నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.

యెషయా 47:12

నీ బాల్యమునుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతువేమో

సంఖ్యాకాండము 23:16

యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి నీవు బాలాకునొద్దకు తిరిగివెళ్లి యిట్లు చెప్పుమనెను.

సంఖ్యాకాండము 23:26

బిలాము యెహోవా చెప్పినదంతయు నేను చేయవలెనని నేను నీతో చెప్పలేదా? అని బాలాకుకు ఉత్తరమియ్యగా

సంఖ్యాకాండము 24:13

యెహోవా యేమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నాయొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా?

1రాజులు 22:14

మీకాయా యెహోవా నాకు సెలవిచ్చునదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుదుననెను.

2దినవృత్తాంతములు 18:13

మీకాయా యెహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చునదేదో దానినే ప్రవచింతునని చెప్పెను.

నిర్గమకాండము 4:15

నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడైయుండి, మీరు చేయవలసినదానిని మీకు బోధించెదను.

సంఖ్యాకాండము 23:12

అందుకతడు యెహోవా నా నోట ఉంచినదాని నేను శ్రధ్ధగా పలుకవద్దా? అని ఉత్తరమిచ్చెను.

సంఖ్యాకాండము 23:20

ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను ఆయన దీవించెను; నేను దాని మార్చలేను.

సంఖ్యాకాండము 24:12

అందుకు బిలాము బాలాకుతో బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను నా యిష్టముచొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను.

న్యాయాధిపతులు 7:14

అందుకు వాని చెలికాడు అది ఇశ్రాయేలీయు డైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమేగాని మరేమికాదు; దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతనిచేతికి అప్పగింప బోవుచున్నాడని ఉత్తరమిచ్చెను.

యిర్మియా 1:7

యెహోవా నాకీలాగు సెలవిచ్చెను నేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపువారందరియొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్పవలెను.

అపోస్తలులకార్యములు 4:20

మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;