సంఖ్యాకాండము 22: 4
క్రాస్-రిఫరెన్స్‌లు
" మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టు ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు."
సంబంధిత రిఫరెన్స్‌లు
కాబట్టి మోయాబు పెద్దలును మిద్యాను పెద్దలును సోదె సొమ్మును చేతపట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా
చంపబడిన స్త్రీ పేరు కొజ్బీ, ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధానియై యుండెను.
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను మిద్యానీయులు తమ తంత్రములవలన మీకు బాధకులై యున్నారు; వారిని బాధపెట్టి హతము చేయుడి;
వారు తంత్రములుచేసి పెయోరు సంతతిలోను,
తెగులు దినమందు పెయోరు విషయములో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొజ్బీ సంగతిలోను, మిమ్మును మోసపుచ్చిరి.
చంపబడిన యితరులుగాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను అయిదుగురు రాజులైన ఎవీని, రేకెమును, సూరును, హూరును, రేబను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి.
మోషే జయించిన వాడునైన సీహోను వశముననున్న ఎవీ రేకెము సూరు హోరు రేబ అను మిద్యానురాజుల దేశమును అమోరీ యుల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్య ముగా ఇచ్చెను.
ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడును సోదెగాడు నైన బిలామును తాము చంపిన తక్కినవారితో పాటు ఖడ్గముతో చంపిరి.
ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరిని నాశనము చేయును.
మోయాబు ఇంటి పైకప్పులన్నిటిమీదను దాని వీధులలోను అంగలార్పు వినబడుచున్నది ఒకడు పనికిమాలిన ఘటమును పగులగొట్టునట్లు నేను మోయాబును పగులగొట్టుచున్నాను ఇదే యెహోవా వాక్కు.
సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను.
మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకుకంటె నీవు ఏమాత్రమును అధికుడవు కావుగదా? అతడు ఇశ్రాయేలీయులతో ఎప్పుడైనను కలహించెనా? ఎప్పుడైనను వారితో యుద్ధము చేసెనా?
ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనువారిని కనెను.
అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇశ్రాయేలు సంతతియైన యీ జనము మనకంటె విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది.
బిలాము దేవునితో యిట్లనెను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు
ఇదిగో మోషే కన్నులయెదుటను, ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వసమాజముయొక్క కన్నులయెదుటను, ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరులయొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొనివచ్చెను.
శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్లబోవుచున్నారు, వారు మీకు భయపడుదురు; మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి.
మనము తిరిగి మోయాబు అరణ్యమార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను మోయాబీయులను బాధింపవద్దు; వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను.
వారు మిద్యాను దేశములోనుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి, పారాను దేశమునుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐగుప్తురాజగు ఫరోనొద్దకు రాగా, ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారము నిర్ణయించెను.
అబ్రాహాముయొక్క ఉపపత్నియైన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను యొక్షాను మెదాను మిద్యాను ఇష్బాకు షూవహు. యొక్షాను కుమారులు షేబదాను.
హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబీయా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి.
కూషీయుల డేరాలలో ఉపద్రవము కలుగగా నేను చూచితిని మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణకెను.