లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 22: 30

క్రాస్-రిఫరెన్స్‌లు

" అందుకు గాడిద నేను నీదాననైనది మొదలుకొని నేటివరకు నీవు ఎక్కుచు వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైన నీకిట్లు చేయుట కద్దా? అని బిలాముతో అనగా అతడు లేదనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2పేతురు 2:16

ఆ బిలాము దుర్నీతివలన కలుగు బహుమానమును ప్రేమించెను; అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను, ఎట్లనగా నోరులేని గార్దభము మానవస్వరముతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెఱ్ఱితనము అడ్డగించెను.

1కొరిందీయులకు 1:27

ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,

1కొరిందీయులకు 1:28

జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

సంఖ్యాకాండము 16:15

అందుకు మోషే మిక్కిలి కోపించి నీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకుము. ఒక్క గాడిదనైనను వారియొద్ద నేను తీసికొనలేదు; వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యెహోవాయొద్ద మనవిచేసెను.