లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 26: 35

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి; షూతలహీయులు షూతలహు వంశస్థులు; బేకరీయులు బేకరు వంశస్థులు; తహనీయులు తహను వంశస్థులు,"

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 7:20

ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒకడుండెను; అతనికి బెరెదు కుమారుడు, బెరెదునకు తాహతు కుమారుడు, తాహతునకు ఎలాదా కుమారుడు, ఎలాదాకు తాహతు కుమారుడు,

1దినవృత్తాంతములు 7:21

తాహతునకు జాబాదు కుమారుడు. వీనికి షూతలహు ఏజెరు ఎల్యాదు అనువారు పుట్టిరి; వారు తమ దేశములో పుట్టిన గాతీయుల పశువులను పట్టుకొనిపోవుటకు దిగిరాగా ఆ గాతీయులు వారిని చంపిరి.

సంఖ్యాకాండము 1:32

యోసేపు పుత్రుల వంశావళి, అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా