సంఖ్యాకాండము 3: 29
క్రాస్-రిఫరెన్స్‌లు
" కహాతు కుమారుల వంశములు మందిరము యొక్క ప్రక్కను, అనగా దక్షిణదిక్కున దిగవలసినవారు."
సంబంధిత రిఫరెన్స్‌లు
గెర్షోనీయుల వంశములు మందిరము వెనుకను, అనగా పడమటిదిక్కున దిగవలెను.
ఇశ్రాయేలీయుల సమాజముమీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టు దిగవలెను; వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను.
రూబేను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున దక్షిణదిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు.
మెరారీయుల పితరుల కుటుంబములో అబీహాయిలు కుమారుడైన సూరీయేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తరదిక్కున దిగవలసినవారు.
మందిరము ఎదుటి తూర్పుదిక్కున, అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వదిశయందు దిగవలసినవారు మోషే అహరోనులు అహరోను కుమారులు; ఇశ్రాయేలీయులు కాపాడవలసిన పరిశుద్ధస్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించినయెడల అతడు మరణశిక్ష నొందును.