సంఖ్యాకాండము 3: 35
క్రాస్-రిఫరెన్స్‌లు
" మెరారీయుల పితరుల కుటుంబములో అబీహాయిలు కుమారుడైన సూరీయేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తరదిక్కున దిగవలసినవారు."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఒక నెల మొదలుకొని పై ప్రాయముగల మగవారందరి లెక్కచూడగా ఎనిమిదివేల ఆరువందలమంది పరిశుద్ధస్థలమును కాపాడవలసినవారైరి.
కహాతు కుమారుల వంశములు మందిరము యొక్క ప్రక్కను, అనగా దక్షిణదిక్కున దిగవలసినవారు.
ఇశ్రాయేలీయుల సమాజముమీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టు దిగవలెను; వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను.
దాను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున ఉత్తరదిక్కున ఉండవలెను. అమీషదాయి కుమారుడైన అహీయెజెరు దాను కుమారులకు ప్రధానుడు.
మందిరము ఎదుటి తూర్పుదిక్కున, అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వదిశయందు దిగవలసినవారు మోషే అహరోనులు అహరోను కుమారులు; ఇశ్రాయేలీయులు కాపాడవలసిన పరిశుద్ధస్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించినయెడల అతడు మరణశిక్ష నొందును.
వీరు హూరీ అనువానికి పుట్టిన అబీహాయిలు కుమారులు. ఈ హూరీ యరోయకు యారోయ గిలాదునకు గిలాదు మిఖాయేలునకు మిఖాయేలు యెషీషైకి యెషీషై యహదోకు యహదో బూజునకు పుట్టిరి.