లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 30: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆమె భర్త వినినదినమందే వాటిని బొత్తిగా రద్దుచేసినయెడల, ఆమె మ్రొక్కుబళ్లను గూర్చియు, ఆమె మీది ఒట్టును గూర్చియు ఆమె పలికినదేదియు నిలువకపోవును; ఆమె భర్త వాటిని రద్దుచేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును."

సంబంధిత రిఫరెన్స్‌లు

1కొరిందీయులకు 11:3

ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను.

సంఖ్యాకాండము 30:5

ఆమె తండ్రి వినినదినమున ఆక్షేపణ చేసినయెడల, ఆమె మ్రొక్కుబడులలో ఏదియు, ఆమె తనమీద పెట్టుకొనిన బాధ్యతలో ఏదియు నిలువకపోవును.

సంఖ్యాకాండము 30:8

ఆమె భర్త వినినదినమందే ఆక్షేపణ చేసినయెడల, అతడు ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనగా తనమీద పెట్టుకొనిన ఒట్టులను రద్దుచేసినవాడగును; యెహోవా ఆమెను క్షమించును.

సంఖ్యాకాండము 15:25

యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను; తెలియకయే దాని చేసెను గనుక క్షమింపబడును. వారు పొరబాటున చేసిన పాపములనుబట్టి తమ అర్పణమును, అనగా యెహోవాకు చెందవలసిన హోమమును పాపపరిహారార్థబలిని యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను.

సంఖ్యాకాండము 15:28

పొరబాటున యెహోవా సన్నిధిని దాని చేసెను గనుక తెలియకయే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును; వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన వాడు క్షమాపణ నొందును.

సంఖ్యాకాండము 30:15

అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దుచేసినయెడల, తానే ఆమె దోషశిక్షను భరించును.

కీర్తనలు 66:14

నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను

యిర్మియా 44:17

మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయముగా నెరవేర్చబోవుచున్నాము; మేమును మా పితరులును మా రాజులును మా యధిపతులును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము; ఏలయనగా మేము ఆలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే యుంటిమి, యే కీడును మాకు కలుగలేదు.

రోమీయులకు 4:14

ధర్మశాస్త్ర సంబంధులు వారసులైనయెడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమగును.