లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 30: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రియింట నుండగా యెహోవాకు మ్రొక్కుకొని బద్ధురాలైనయెడల, ఆమె తండ్రి ఆమె మ్రొక్కుబడిని ఆమె కలుగజేసికొనిన బాధ్యతను విని దానిగూర్చి ఊరకొనినయెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలుచును."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 30:2

ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనినయెడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసినయెడల, అతడు తన మాటతప్పక తననోటనుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను.

1సమూయేలు 1:11

సైన్యములకధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన యెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను,

1కొరిందీయులకు 14:34

స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడి యుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది.