లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 31: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 4:22
మరియు సిల్లా తూబల్కయీనును కనెను. అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు. తూబల్కయీను సహోదరి పేరు నయమా.
సంఖ్యాకాండము 31:13
మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరును వారిని ఎదుర్కొనుటకు పాళెములోనుండి వెలుపలికి వెళ్లిరి.
యెహోషువ 8:27
యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాటచొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణములోని పశువులను సొమ్మును తమకొరకు కొల్లగా దోచుకొనిరి.
యోబు 28:2
ఇనుమును మంటిలోనుండి తీయుదురు రాళ్లు కరగించి రాగి తీయుదురు.