లేఖనాలను అన్వేషించండి

1రాజులు 12: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు అతనితో కూడ ఎదిగిన ఆ యౌవనస్థులు ఈ ఆలోచన చెప్పిరి నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దానిని చులకనగా చేయవలెనని నీతో చెప్పుకొనిన యీ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇమ్ము నా తండ్రి నడుముకంటె నా చిటికెన వ్రేలు పెద్దదిగా ఉండును."

సంబంధిత రిఫరెన్స్‌లు

2సమూయేలు 17:7

హూషై అబ్షాలోముతో ఇట్లనెను. ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిదికాదు.

2సమూయేలు 17:8

నీ తండ్రియు అతని పక్షమున నున్నవారును మహా బలాఢ్యులనియు, అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంట్ల వంటివారై రేగిన మనస్సుతో ఉన్నారనియు నీకు తెలియును. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడ బసచేయడు.

2సమూయేలు 17:9

అతడేదో యొక గుహయందో మరి ఏ స్థలమందో దాగియుండును. కాబట్టి నీవారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతినిబట్టి అబ్షాలోము పక్షమున నున్నవారు ఓడిపోయిరని చెప్పుకొందురు.

2సమూయేలు 17:10

నీ తండ్రి మహా బలాఢ్యుడనియు, అతని పక్షపువారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీయులందరును ఎరుగుదురు గనుక సింహపుగుండెవంటి గుండెగలవారు సయితము దిగులొందుదురు.

2సమూయేలు 17:11

కాబట్టి నా ఆలోచన యేమనగా, దానునుండి బెయేర్షెబావరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇశ్రాయేలీయులనందరిని నలుదిశలనుండి నీయొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను.

2సమూయేలు 17:12

అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో యొకదానియందు అతనిమీద పడుదుము; నేలమీద మంచుపడురీతిగా మనము అతనిమీదికి వచ్చినయెడల అతని పక్షపువారిలో ఒకడును తప్పించుకొనజాలడు.

2సమూయేలు 17:13

అతడు ఒక పట్టణములో చొచ్చినయెడల ఇశ్రాయేలీయులందరును ఆ పట్టణమునకు త్రాళ్లు తీసికొనివచ్చి యొక చిన్న రాయి అచ్చట కనబడకుండ దానిని నదిలోనికి లాగుదురు.

2దినవృత్తాంతములు 10:10

అతనితో కూడ పెరిగిన యీ యౌవనస్థులు అతనితో ఇట్లనిరి నీ తండ్రి మా కాడిని బరువుచేసెను, నీవు దానిని చులుకన చేయుమని నీతో పలికిన యీ జనులతో నీవు చెప్పవలసినదేమనగా నా చిటికెనవ్రేలు నా తండ్రియొక్క నడుముకంటె బరువుగా ఉండును;

2దినవృత్తాంతములు 10:11

నా తండ్రి బరువైన కాడి మీమీద మోపెను గాని నేను మీ కాడిని మరింత బరువు చేయుదును; నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను గాని నేను కొరడాలతో మిమ్మును దండించెదనని చెప్పుము.

సామెతలు 10:14

జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు మూఢుల నోరు అప్పుడే నాశనము చేయును.

సామెతలు 18:6

బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి. దెబ్బలు కావలెనని వాడు కేకలువేయును.

సామెతలు 18:7

బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును.

సామెతలు 28:25

పేరాస గలవాడు కలహమును రేపును యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును.

సామెతలు 29:23

ఎవని గర్వము వానిని తగ్గించును వినయ మనస్కుడు ఘనతనొందును

యెషయా 47:6

నా జనులమీద కోపపడి నా స్వాస్థ్యము నపవిత్రపరచి వారిని నీచేతికి అప్పగించితిని నీవు వారియందు కనికరపడక వృద్దులమీద నీ కాడిమ్రానును మిక్కిలి బరువుగా మోపితివి.

1సమూయేలు 8:11

ఈలాగున చెప్పెను మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా, అతడు మీ కుమారులను పట్టుకొని, తన రథములను తోలుటకును తన గుఱ్ఱములను కాపాడుటకును వారిని ఉంచుకొనును, కొందరు అతని రథముల ముందర పరగెత్తుదురు.

1రాజులు 12:14

నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును, నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను గాని నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును.

సామెతలు 13:10

గర్వమువలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును.

సామెతలు 13:20

జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.

సామెతలు 28:16

వివేకము లేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారీ, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును.

ప్రసంగి 4:16

అతని ఆధిపత్యము క్రింది జనులకు లెక్కయే లేదు, అయినను తరువాత రాబోవువారు వీనియందు ఇష్టపడరు. నిజముగా ఇదియు వ్యర్థమే, ఒకడు గాలికై ప్రయాసపడినట్టే.