1రాజులు 12: 13
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యౌవనులు చెప్పిన ఆలోచనచొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి యిట్లు ఆజ్ఞాపించెను"
సంబంధిత రిఫరెన్స్‌లు
రేపు ఈ వేళకు వారు నీ యింటిని నీ సేవకుల యిండ్లను పరిశోధించుదురు; అప్పుడు నీ కంటికి ఏది యింపుగా నుండునో దానిని వారు చేతపట్టుకొని తీసికొనిపోవుదురు.
కాగా ఇశ్రాయేలు రాజు దేశపు పెద్దలనందరిని పిలువనంపించి బెన్హదదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకొందునని వర్తమానము పంపగా నేను ఇయ్యనని చెప్పలేదు; ఆ మనుష్యుడు చేయగోరుచున్న మోసము ఎట్టిదో అది మీరు తెలిసికొనుడనెను.
నీవతని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలును జనులందరును అతనితో చెప్పిరి,
గనుక అతడు మీరు రాజైన నా యేలినవానితో తెలియజెప్పవలసినదేమనగా నీవు మొదట నీ సేవకుడనైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతును గాని, నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెన్హదదు దూతలతో చెప్పుడనెను. ఆ దూతలు పోయి బెన్హదదునొద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా
బెన్హదదు మరల అతనియొద్దకు దూతలను పంపి నాతోకూడ వచ్చిన వారందరును పిడికెడు ఎత్తికొనిపోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలినయెడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగజేయుదురు గాక అని వర్తమానము చేసెను.
అందుకు ఇశ్రాయేలు రాజు తన ఆయుధమును నడుమున బిగించుకొనువాడు దానివిప్పి తీసివేసినవానివలె అతిశయపడకూడదని చెప్పుడనెను.
యోసేపు తన సహోదరులను చూచి వారిని గురుతుపట్టి వారికి అన్యునివలె కనబడి వారితో కఠినముగా మాటలాడి మీరెక్కడనుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారు ఆహారము కొనుటకు కనాను దేశమునుండి వచ్చితిమనిరి.
ఎట్లనగా ఆ దేశమునకు ప్రభువైనవాడు మాతో కఠినముగా మాటలాడి, మేము ఆ దేశమును వేగుచూడ వచ్చినవారమని అనుకొనెను.
ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయననెను.
గనుక ఫరో నా యెదుటనుండి పొమ్ము భద్రము సుమీ; నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువని అతనితో చెప్పెను.
ఎఫ్రాయిమీయులు కూడుకొని ఉత్తరదిక్కునకు పోయినీవు అమ్మోనీయులతో యుద్ధము చేయ బోయి నప్పుడు నీతో వచ్చుటకు మమ్ము నేల పిలువ లేదు? నీవు కాపురమున్న నీ యింటిని అగ్నితో కాల్చివేయుదుమని యెఫ్తాతో చెప్పగా
యెఫ్తానాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహము కలిగిన ప్పుడు నేను మిమ్మును పిలిచితిని గాని మీరు వారిచేతులలోనుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి
నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయు లతో యుద్ధము చేయపోతిని. అప్పుడు యెహోవా వారిని నాచేతి కప్పగించెను గనుక నాతో పోట్లాడుటకు మీరేల నేడు వచ్చితిరనెను.
అప్పుడు యెఫ్తా గిలాదువారి నందరిని పోగుచేసికొని ఎఫ్రాయిమీయులతో యుద్ధము చేయగా గిలాదువారు ఎఫ్రాయిమీయులను జయించిరి. ఏలయనగా వారుఎఫ్రాయిమీయులకును మనష్షీ యులకును మధ్యను గిలాదువారైన మీరు ఎఫ్రాయిమీ యులయెదుట నిలువక పారిపోయిన వారనిరి.
ఎఫ్రాయి మీయులతో యుద్ధముచేయుటకై గిలాదువారు యొర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీ యులలో ఎవడోనన్ను దాటనియ్యుడని చెప్పినప్పుడు గిలాదువారునీవు ఎఫ్రాయిమీయుడవా అని అతని నడి గిరి.
అందుకతడునేను కాను అనినయెడల వారు అతని చూచిషిబ్బోలెతను శబ్దము పలుకుమనిరి. అతడు అట్లు పలుకనేరక సిబ్బోలెతని పలుకగా వారు అతని పట్టుకొని యొర్దానురేవులయొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయి మీయులలో నలువది రెండువేలమంది పడి పోయిరి.
దావీదు నీ తండ్రి నన్నుగూర్చి నీతో కఠినముగా మాటలాడినయెడల దాని నాకు తెలియజేయువారెవరని యోనాతాను నడిగెను.
సౌలు యోనాతానుమీద బహుగా కోపపడి ఆగడగొట్టుదాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా?
యెష్షయి కుమారుడు భూమిమీద బ్రదుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు గదా; కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతడు మరణమునకర్హుడని చెప్పెను.
నాబాలు దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు.
నేను సంపాదించుకొనిన అన్నపానములను, నా గొఱ్ఱలబొచ్చు కత్తిరించువారికొరకు నేను వధించిన పశుమాంసమును తీసి, నేను బొత్తిగా ఎరుగనివారి కిత్తునా? అని దావీదు దాసులతో చెప్పగా
అందుకు ఇశ్రాయేలు వారు రాజులో మాకు పది భాగములున్నవి; మీకంటె మేము దావీదునందు అధిక స్వాతంత్ర్యము గలవారము; రాజును తోడుకొని వచ్చుటను గురించి మీతో ముందుగా మాటలాడినవారము మేమే గదా మీరు మమ్మును నిర్లక్ష్యము చేసితిరేమి? అని యూదావారితో పలికిరి. యూదావారి మాటలు ఇశ్రాయేలు వారి మాటలకంటె కఠినముగా ఉండెను.
నీతిమంతుని నోరు జీవపు ఊట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును.
నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును.
మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.
దరిద్రుడు బతిమాలి మనవి చేసికొనును ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును.
జ్ఞానుని నోటిమాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మింగివేయును.
అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునైయున్నది
అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీచేతిలో ఉన్నది; నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని శారయితో చెప్పెను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమెయొద్దనుండి అది పారిపోగా
జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.
వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవచేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరమిచ్చినయెడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి.
ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు ఘనులు క్రింద కూర్చుండుటయు