1రాజులు 4: 1
క్రాస్-రిఫరెన్స్‌లు
" రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిమీద రాజాయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
రాజ్యమంతయు తీసివేయను; నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికిచ్చెదను.
అయితే అతని కుమారుని చేతిలోనుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు పది గోత్రముల నిచ్చెదను;
నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా యెదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడు నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను.
ఈ ప్రకారము ఇశ్రాయేలువారు నేటివరకు జరుగుచున్నట్లు దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసిరి.
మరియు యరొబాము తిరిగివచ్చెనని ఇశ్రాయేలు వారందరు విని, సమాజముగా కూడి, అతని పిలువనంపించి ఇశ్రాయేలువారందరిమీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి; యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతివారిని వెంబడించినవారెవరును లేకపోయిరి.
హెబ్రోనులో అతడు యూదా వారందరిమీద ఏడు సంవత్సరములు ఆరు మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరిమీద ముప్పదిమూడు సంవత్సరములు పరిపాలన చేసెను.
ఇశ్రాయేలులో కడమ వారందరును ఏక మనస్కులై దావీదును రాజుగా నియమింపవలెనని కోరియుండిరి.
సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరిమీద నలుబది సంవత్సరములు ఏలుబడి చేసెను.
ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులమీద రాజునై యుంటిని.
యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు.
అయితే ఇశ్రాయేలీయులలో ఎవనినైనను సొలొమోను దాసునిగా చేయలేదు; వారు రాణువవారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను ఉండిరి.
రెహబామునకు పట్టాభిషేకము చేయుటకై ఇశ్రాయేలీయులందరును షెకెమునకు వెళ్లగా రెహబాము షెకెమునకు పోయెను.