1రాజులు 4: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఇశ్రాయేలీయులందరిమీద సొలొమోను పన్నిద్దరు అధికారులను నియమించెను. వీరు రాజునకును అతని ఇంటివారికిని ఆహారము సంగ్రహము చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
జనసంఖ్యనుబట్టి ఇశ్రాయేలీయుల పితరుల యింటిపెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అనువారి లెక్కను గూర్చినది, అనగా ఏర్పాటైన వంతుల విషయములో ఏటేట నెలవంతున రాజునకు సేవచేసినవారిని గూర్చినది. వీరి సంఖ్య యిరువది నాలుగు వేలు.
మొదటి నెలను మొదటి భాగముమీద జబ్దీయేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను; వాని భాగములో ఇరువది నాలుగు వేలమంది యుండిరి.
పెరెజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులకందరికి అధిపతిగా ఉండెను.
రెండవ నెల వంతు అహోహీయుడైన దోదైదియు అతని భాగపువారిదియు ఆయెను; అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
మూడవ నెలను యెహోయాదా కుమారుడును సభాముఖ్యుడునగు బెనాయా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
ఈ బెనాయా ఆ ముప్పదిమంది పరాక్రమశాలులలో ఒకడై ఆ ముప్పదిమందికి అధిపతియై యుండెను; అతని భాగమందు అతని కుమారుడైన అమ్మీజాబాదు ఉండెను.
నాలుగవ నెలను యోవాబు సహోదరుడైన అశాహేలు నాలుగవ అధిపతిగా ఉండెను; అతని కుమారుడైన జెబద్యా అతని తరువాత అధిపతియాయెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
అయిదవ నెలను ఇశ్రాహేతీయుడైన షవ్హుూతు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
ఆరవ నెలను తెకోవీయుడైన ఇక్కెషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
ఏడవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పెలోనీయుడునైన హేలెస్సు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
ఎనిమిదవ నెలను జెరహీయుల సంబంధుడును హుషాతీయుడునైన సిబ్బెకై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
తొమ్మిదవ నెలను బెన్యామీనీయుల సంబంధుడును అనాతోతీయుడునైన అబీయెజెరు అధిపతిగా ఉండెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
పదియవ నెలను జెరహీయుల సంబంధుడును నెటోపాతీయుడునైన మహరై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
పదకొండవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పిరాతోనీయుడునైన బెనాయా అధిపతిగా ఉండెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
పండ్రెండవ నెలను ఒత్నీయేలు సంబంధుడును నెటోపాతీయుడునైన హెల్దయి అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును; తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును.
నాతాను కుమారుడైన అజర్యా అధికారులమీద ఉండెను; నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రియునై యుండెను;
మరియు రాజైన సొలొమోనునకును రాజైన సొలొమోను భోజనపు బల్లయొద్దకు వచ్చిన వారికందరికిని ఏమియు తక్కువకాకుండ అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాసమునుబట్టి ఆహారము సంగ్రహము చేయుచు వచ్చెను.
వీరిని అతడు వంతులచొప్పున నెలకు పదివేలమందిని లెబానోనునకు పంపించెను; ఒక నెల లెబానోనులోను రెండు నెలలు ఇంటియొద్దను వారు ఉండిరి; ఆ వెట్టివారిమీద అదోనీరాము అధికారియై యుండెను.
నీ తండ్రి బరువైన కాడిని మామీద ఉంచెను; నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మామీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసినయెడల మేము నీకు సేవచేయుదుము.
షెఫేలా ప్రదేశముననుండు ఒలీవ చెట్లమీదను మేడిచెట్లమీదను గెదేరీయుడైన బయల్ హనాను నియమింపబడెను; నూనె కొట్లమీద యోవాషు నియమింపబడెను.
ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయములయందు మేలు కలుగును.
ఏ గోత్రపువారైనను పట్టణములో కష్టముచేసి జీవించువారు దానిని సాగుబడిచేయుదురు.