లేఖనాలను అన్వేషించండి

1రాజులు 4: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" నఫ్తాలీము దేశమందు అహిమయస్సు ఉండెను; వీడు సొలొమోను కుమార్తెయైన బాశెమతును వివాహము చేసికొనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 19:32

ఆరవ వంతు చీటి వారి వంశములచొప్పున నఫ్తాలీ యుల పక్షమున వచ్చెను.

యెహోషువ 19:33

వారి సరిహద్దు హెలెపును జయనన్నీములోని సిందూరవనమును అదామియను కను మను యబ్నెయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి

యెహోషువ 19:34

అక్కడనుండి పడమరగా అజనోత్తాబోరు వరకు వ్యాపించి అక్కడనుండి హుక్కోకువరకు దక్షిణదిక్కున జెబూ లూనును, పడమట ఆషేరును దాటి తూర్పున యొర్దాను నొద్ద యూదావరకును వ్యాపించెను.

యెహోషువ 19:35

కోటగల పట్ట ణము లేవనగా జిద్దీము జేరు హమ్మతు రక్కతు కిన్నెరెతు

యెహోషువ 19:36

అదామా రామా హాసోరు

యెహోషువ 19:37

కెదెషు ఎద్రెయీ ఏన్‌హాసోరు

యెహోషువ 19:38

ఇరోను మిగ్దలేలు హొరేము బేతనాతు బేత్షెమెషు అను నవి; వాటి పల్లెలుగాక పందొమ్మిది పట్టణములు.

యెహోషువ 19:39

ఆ పట్ట ణములును వాటి పల్లెలును వారి వంశములచొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.

1రాజులు 4:11

మరియు అబీనాదాబు కుమారునికి దోరు మన్యప్రదేశమంతయు నియమింపబడెను; సొలొమోను కుమార్తెయైన టాపాతు ఇతని భార్య.

1సమూయేలు 18:18

అందుకు దావీదు రాజునకు అల్లుడనగుటకు నేనెంతటివాడను? నా స్థితియైనను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏపాటివని సౌలుతో అనెను.